- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలోని అగ్రహారం తండా గ్రామపంచాయతీ పరిధిలో కొత్తగా కాలనీ ఏర్పడుతోంది. ఈ క్రమంలో ఇల్లు కట్టుకుంటున్న ప్రజలకు మంచినీటి సమస్య ఉండకూడదని, ఎమ్మెల్యే వంశీకృష్ణ రూ.1.40 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మంచినీటి కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ రూప్ సింగ్, మిషన్ భగీరథ ఏఈ రితీష్, అగ్రహారం తండా మాజీ సర్పంచ్ ప్రశాంత్, వార్డు సభ్యులు దేవ్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -