Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కురుమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన సన్మానం

కురుమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
బిచ్కుంద మండలం శెట్లూర్ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మంజీరా వాగు ఉదృతంగా ప్రవహించడంతో అందులో చిక్కుకున్న నలుగురు గొర్రెల కాపరులు, 656 గొర్రెలను సురక్షితంగా కాపాడినందుకు ప్రత్యేకంగా కృషిచేసిన జుక్కల్ ఎమ్మెల్యే తొట్టా లక్ష్మి కాంతారావుకు మద్నూర్ మండల కేంద్రంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారిని కుర్మ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కురుమ సంఘం జిల్లా కమిటీ నాయకులు జుక్కల్ నియోజకవర్గం నాయకులు మాట్లాడుతూ వరద నీటిలో చిక్కుకుపోయిన గొర్రెల కాపరులను గొర్రెలను సురక్షితంగా ప్రాణాలను కాపాడిన ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కృషి మూలంగా కాపర్లకు గొర్రెలకు పునర్జన్మ అందించారని జీవితాంతం కురుమ సంఘం తరఫున ఎమ్మెల్యేకు మరువలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా నాయకులు నియోజకవర్గం నాయకులు మండల నాయకులు ఎమ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad