- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు జన్మదినం సందర్భంగా ఆదివారం యువ నాయకులంతా హైదరాబాదుకు తరలివెళ్లి ఎమ్మెల్యేకు గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయి పటేల్ మండల యువ నాయకులు సచిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెనుకబడ్డ జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రజాసేవకి విశేషంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే కు ఆ భగవంతుడు ఆశీర్వదించాలని నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజాసేవకు అంకితం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే అభినందించారు.
- Advertisement -