నవతెలంగాణ – జుక్కల్
శుక్రవారం జుక్కల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ కేంద్రమైన జుక్కల్ కేంద్రంలో పార్టీ కార్యాలయం ప్రారంభించినందుకు కాంగ్రెస్ నాయకులకు మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలకు మండల స్థాయి నాయకులందరూ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించే విధంగా ఉపయోగకరంగా ఉంటుందని పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు కేమ్రాజ్ కల్లాలి మాజీ సర్పంచ్ రమేష్ దేశాయ్, నాయకులు రాజులు సెట్ , అనిల్ సెట్ , సాయ గౌడ్, సతీష్ పటేల్ , మనోహర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
జుక్కల్ లో కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES