Friday, May 16, 2025
Homeతెలంగాణ రౌండప్గాండ్ల పట్టణ సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

గాండ్ల పట్టణ సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : సిర్నాపల్లి గడి గాండ్ల పట్టణ సంఘం రెండొవ అంతస్థు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, నూడా చైర్మన్ కేశ వేణు, సంఘం పెద్దమనుషులతో కలిసి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ..ఇందూర్ పట్టణ గాండ్ల సంఘం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచేవిదంగా ఐక్యమత్యంతో అంచలంచలుగా ఎదగడం అభినందనీయం అన్నారు. గాండ్ల పట్టణ సంఘం రెండవ అంతస్తుకు ఎస్ డి ఎఫ్ కింద రూ.5 లక్షలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా సంఘం అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు రెండు ఏండ్లు కావొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎమ్మెల్యే నిధులు కూడా మంజూరు చేయలేదని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ అర్బన్ నియోజకవర్గంపై ప్రత్యేక చొరవ తీసుకొని స్పెషల్ ఫండ్ మంజురు చేయాలనీ విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో గాండ్ల పట్టణ సంఘం అధ్యక్షులు అశోక్, నాగరాజు, నూడా చైర్మన్ కేశవేణు, నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -