Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కస్తూర్బా కళాశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

కస్తూర్బా కళాశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – దామరచర్ల
నాణ్యమైన విద్యను అందించడమే నిజమైన అభివృద్ధి అని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. దామరచర్ల మండల కేంద్రంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన  కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కళాశాల అదనపు భవన సముదాయమును మంగళవారం ప్రారంభించిన అనంతరం విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే గురుకులాలలో కాస్మొటిక్ ఛార్జీలు,మెస్ చార్జీలు పెంచారని చెప్పారు.  రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొని వస్తున్నారని అన్నారు.

మన మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతీ పేద విద్యార్థికి మెరుగైన విద్యను అందించే లక్ష్యంగా సి ఎస్ ఆర్  ఫండ్స్ ద్వారా ప్రభుత్వ గురుకులాలకు పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒక విద్యార్థి చదువుకొని అభివృద్ధి చెందితే ఒక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రతీ విద్యార్థి మంచిగా చదువుకొని మన మిర్యాలగూడకి మంచి పేరు తీసుకొని రావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో దామరచర్ల తహసీల్దార్ జవహర్ లాల్ ,ఎం ఈ ఓ బాలాజీ నాయక్, ఎస్ ఓ కవిత  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి గాలం వెంకన్న యాదవ్ , మాజీ సర్పంచ్ బంటు కిరణ్ , ఎస్సి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సదానందం , కాంగ్రెస్ నాయకులు  ఘని , నాగు నాయక్ , శ్యామ్ సుందర్ రెడ్డి , నర్సింహారెడ్డి ,గోవింద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad