Friday, March 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
మార్క్‌ఫెడ్ సహకారంతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు తమ పంటను మధ్యవర్తుల వద్ద అమ్మకుండా, ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను చేసుకోవాలని రైతులకు సూచించారు.

అలాగే రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా రైతులకు సరైన ధర లభిస్తుందని మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుందన్నారు. ఇది రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్  రజిత మల్లేష్, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాస్, మార్క్ ఫెడ్  అధికారులు, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి, అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -