Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్నూతన జిమ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ..

నూతన జిమ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ..

- Advertisement -

నవతెలంగాణ – గోదావరిఖని : రామగుండం నియోజకవర్గం గోదావరిఖని పట్టణంలోని ప్రముఖ SIMS మెడికల్ కాలేజీలో నూతనంగా రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన (జిమ్)   జిమ్నాసియాన్ని (Gym)ను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ మంగళవారం  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్, హిమబిందు, అధ్యాపకులు, విద్యార్థులు  పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్  విద్యార్థులతో ముచ్చటించారు. వారి విద్యా, వసతి, ఆరోగ్య సంబంధిత సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు ఇవ్వనుందని, కళాశాలలో మరింత ఆధునిక వసతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “విద్యార్థులు మంచి ఫిజికల్, మెంటల్ హెల్త్ కోసం అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి. మీరు బాగా చదివి ఉన్నతస్థాయిలో ఎదగాలి. ఇదే మా ఆశయము. విద్యారంగ అభివృద్ధే మన భవిష్యత్ శక్తికి ఆధారం” అని అన్నారు. కాలేజీలో విద్యార్థుల కోసం ఇలాంటి వసతుల అందుబాటులోకి రావడం ఆనందదాయకం అని పేర్కొంటూ, విద్యార్థుల సంక్షేమం కోసం అన్ని రంగాలలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగల  అధ్యక్షులు తదితరులున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad