నవతెలంగాణ – వనపర్తి: వనపర్తి పట్టణం నుంచి చందాపూర్ గ్రామం వరకు నిర్మించే రోడ్డు నిర్మాణాన్ని బుధవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పరిశీలించారు. శ్రీనివాసపురం వరకు నిర్మించే సిసి రోడ్డు పనులను నాణ్యవంతంగా చేపట్టాలన్నారు. రోడ్డు వెడల్పును తగ్గించకుండా చూడాలని అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. స్థానిక నాయకులు అధికారులతో సమన్వయమై పనులలో జాప్యం లేకుండా త్వరితగతిన రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని గ్రామస్తులకు రాకపోకులకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుట్టపాకుల మహేష్, స్థానిక మాజీ కౌన్సిలర్ విభూది నారాయణ, బ్రహ్మం చారి, నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చందాపూర్ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES