నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ పరిశీలించారు. మండలంలోని తిర్మ న్ పల్లి, కల్వరాల్ , పద్మాజివాడి, మూడేగాం ధర్మారావుపేట్ అమర్లబండ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి అభిప్రాయాలను ప్రత్యక్షంగా మాట్లాడారు. పురోగతిని లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరాతీశారు.
లబ్ధిదారులు స్పందిస్తూ పనుల నాణ్యత పురోగతి పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం పట్ల అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదోడు ఇల్లు కట్టి గృహప్రవేశం చేసిన రోజే విజయం సాధించినట్లు అని అన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ కాలనీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల గౌరవ శాఖ ఎంబి గౌతం కలిసి నియోజకవర్గ నీకి మరిన్ని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలిచేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES