Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శివరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం 

శివరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం 

- Advertisement -

సమస్యల పరిష్కారానికి వినతి 
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అందజేత 
నవతెలంగాణ-రామారెడ్డి 

మండలంలోని పోసానిపేట లో వెలసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి(గుడి గంటలు) ఆలయంలో శివరాత్రి ఉత్సవాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్ రావు ను ఆహ్వానిస్తూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్వామివారి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి మినీ ఫంక్షన్ హాల్ కోసం రూ 10 లక్షలు, ఆలయ చుట్టూ సిసి రోడ్ నిర్మాణానికి రు.5 లక్షలు మంజూరు చేయాలని ఆలయ కమిటీ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నా రెడ్డి మహిపాల్ రెడ్డి, కార్యదర్శి పోతుల భాస్కర్ రెడ్డి, గి రెడ్డి మహేందర్ రెడ్డి, బండి పోచయ్య, నిశాంత్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -