నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలవ్వాలంటే సర్పంచ్‌ల నుంచి మండల నాయకుల వరకు ప్రతి ఒక్కరూ స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు..
రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ రంగాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం జుక్కల్ మండల కేంద్రంలో పెద్ద ఎడిగి గ్రామంలో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించి, పనులు నాణ్యతగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తదుపరి పెద్ద గుల్ల గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.



