Tuesday, December 30, 2025
E-PAPER
Homeఖమ్మంతిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జారె దంపతులు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జారె దంపతులు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
వైకుంఠ ఏకాదశి సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దంపతులు మంగళవారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. హిందువులకు అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దర్శనం లభించడం అదృష్టంగా భావిస్తూ, భక్తిశ్రద్ధలతో స్వామివారిని సేవించారు. ఈ సందర్భంగా వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే దంపతులు అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి, రైతులు–యువత–మహిళలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రత్యేకంగా ప్రార్థించారు.

అలాగే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే శక్తిని ప్రసాదించాలని కోరుకున్నారు. ఆలయంలో సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొని భక్తి పరవశులయ్యారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దంపతులు తిరుమలలో దర్శనం చేసుకున్న విషయం తెలుసుకున్న నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆశీస్సులతో మరింత ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఉన్నామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -