Monday, March 9, 2026
E-PAPER
Homeఖమ్మంఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని అనంతారం,ఆసుపాక,తిరుమలకుంట లలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు గృహప్రవేశం చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వం పేదల గృహావసరాలను తీర్చేందుకు చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంత ఇళ్ల కలను నెరవేర్చుకుంటున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. లబ్ధిదారులు కొత్త ఇళ్లలో సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -