Friday, September 12, 2025
E-PAPER
Homeఖమ్మంపనుల జాతరను ప్రారంభించిన ఎమ్మెల్యే జారె 

పనుల జాతరను ప్రారంభించిన ఎమ్మెల్యే జారె 

- Advertisement -

– రూ.3 కోట్ల 54 లక్షల,52 వేల ఉపాధి నిధులు వ్యయం
– మౌళిక సదుపాయాలకు ప్రాధాన్యత
నవతెలంగాణ – అశ్వారావుపేట

నియోజక వర్గ వ్యాప్తంగా 2025 – 2026 ఆర్ధిక సంవత్సరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో మౌళిక సదుపాయాల కల్పన లో భాగంగా రూ.3 కోట్ల 54 లక్షల,52 వేల ఉపాధి నిధులు వ్యయంతో గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టనున్న పనుల జాతరను శుక్రవారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ లాంచనంగా ప్రారంభించారు.

ఇందులో సీసీ రోడ్లు,పశువుల పాకలు,కాంపౌండ్ వాల్,బోర్ వెల్స్,ప్లాంటేషన్,మేజిక్ సోక్ పిట్ లాంటి పనులు చేపడతారు. చండ్రుగొండ మండలం లో 14 పంచాయితీల్లో 15 పనులను రూ.47 లక్షల 50 వేలు, అన్నపురెడ్డిపల్లి మండలం లో 7 పంచాయితీల్లో 24 పనులను, రూ.1 కోటి 14 లక్షల 50 వేలు, ములకలపల్లి మండలం లో 7 పంచాయితీల్లో 20 పనులను రూ. 74 లక్షల 95 వేలు, అశ్వారావుపేట మండలం లో 9 పంచాయితీల్లో 10 పనులను రూ.56 లక్షల 18 వేలు, దమ్మపేట మండలం లో 31 పంచాయితీల్లో 33 పనులను రూ.61 లక్షల 38 వేలు నిధులతో చేపట్టిన, చేపట్టనున్న పనులకు ఆయన ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేసారు.

ఈ కార్యక్రమాల్లో పంచాయితీరాజ్ డీఈ శ్రీధర్, ఆయా  మండలాల ఎంపీడీఓ లు అశోక్,కే.మహాలక్ష్మి,ఎం.వీ సత్యనారాయణ,రవీంద్రా రెడ్డి,బి.అప్పారావు లు,మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పధకం ఏపీఓ లు ఏ.శ్రీనివాస్,కే.ప్రమీల,హుస్సేన్,సుధాకర్,రామచంద్ర రావు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -