రూ.2 కోట్లు 90 వేల వ్యయంతో పనులకు ప్రారంభం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ రేపు గురువారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో పర్యటించనున్నారు. 10 పంచాయితీలు,ఒక మున్సిపాల్టీ పరిధిలో ని 14 గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు,భవనాలు,కల్వర్ట్ లకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9 గంటలకు పాత రెడ్డిగూడెంలో సీసీ రోడ్లకు,9. 30 గంటలకు తోగ్గూడెం ఎంపీపీఎస్ ప్రహరీ గోడ కు,10 గంటలకు తిరుమలకుంట ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.10.30 గంటలకు ఉసిర్లగూడెం పాఠశాల నూతన భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు.
11 గంటలకు కుడుములపాడు,11.30 గంటలకు నందిపాడు, మధ్యాహ్నం 12 గంటలకు నారాయణపురం,12. 30 గంటలకు గాండ్లగూడెం లో సీసీ రోడ్ లకు శంకుస్థాపనలు,1 గంటకు కన్నాయిగూడెం (గ్రామ పంచాయతి భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు.2 గంటలకు కేశప్పగూడెం, 2.30 గంటలకు ఊట్లపల్లి,3 గంటలకు దొంతికుంట, 3.30 గంటలకు పేటమాలపల్లి,4 గంటలకు పేరాయిగూడెం,4.30 గంటలకు నారంవారిగూడెం కాలనీ ల్లో సీసీ రోడ్ లకు శంకుస్థాపన లు చేయనున్నారు. ఈ కార్యక్రమం లో మండల అధికారులు,ఆయా పంచాయితీల కార్యదర్శులు, నాయకులు,లబ్దిదారులు,రైతులు,మండల అధ్యక్షులు,మహిళ అధ్యక్షురాలు యూత్ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు,గ్రామ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు సకాలంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.
రేపు అశ్వారావుపేటలో పర్యటించనున్న ఎమ్మెల్యే జారె
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES