వర్షంలోనూ అభివృద్ధి పనులకు శ్రీకారం…
రూ.2 కోట్లు 90 వేల వ్యయంతో పనులకు ప్రారంభం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో విస్త్రుతంగా పర్యటించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వర్షం పడుతున్నప్పటికీ 10 పంచాయితీలు, ఒక మున్సిపాల్టీ పరిధిలో ని 14 గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు, భవనాలు, కల్వర్ట్ లకు శంకుస్థాపన చేసారు. పాత రెడ్డిగూడెం లో సీసీ రోడ్లకు, తోగ్గూడెం ఎంపీపీఎస్ ప్రహరీ గోడకు, తిరుమలకుంట గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ళలో గృహ ప్రవేశాలు చేసారు. ఉసిర్లగూడెం పాఠశాల నూతన భవనం ప్రారంభోత్సవం చేసారు.
కుడుములపాడు, నందిపాడు, నారాయణపురం, గాండ్లగూడెం లో సీసీ రోడ్ లకు శంకుస్థాపనలు, కన్నాయిగూడెం గ్రామ పంచాయతి భవనం ప్రారంభోత్సవం చేసారు. కేశప్పగూడెం, ఊట్లపల్లి, దొంతికుంట, పేటమాలపల్లి, పేరాయిగూడెం, నారంవారిగూడెం కాలనీ ల్లో సీసీ రోడ్ లకు శంకుస్థాపన లు చేసారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ డీ ఈఈ శ్రీధర్, ఏఈఈ అక్షిత, ఐటీడీఏ డీఈఈ బాపనయ్య, ఏఈఈ బీఎస్వీ ప్రసాద్, ఎంపీడీఓ అప్పారావు, ఎంజీఎన్ఆర్జీఎ ఏపీఓ రామచంద్రరావు, కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, తుమ్మ రాంబాబు, జూపల్లి ప్రమోద్, మిండ హరిక్రిష్ణ, తగరం ముత్తయ్య, మండల అధికారులు, ఆయా పంచాయితీల కార్యదర్శులు, నాయకులు, లబ్దిదారులు, రైతులు, మండల అధ్యక్షులు, మహిళ అధ్యక్షురాలు యూత్ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేసారు.