– అభివృద్ధి పనులు ప్రారంభాలు, శంకుస్థాపన లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలం లో బుధవారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటించనున్నారు. రూ. 3 కోట్ల 63 లక్షల వ్యయంతో చేపట్టే,చేసి పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన వివరాలను గండుగులపల్లి లోని తన నివాసం నుంచి మంగళవారం ప్రకటించారు.
ఉదయం 9 గంటల కు మండలంలోని కోయరంగాపురం పంచాయతీ గుంటిమడుగు లో ప్రారంభం అయ్యే ఆయన పర్యటన నందిపాడు, గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం, నారాయణపురం, ఆసుపాక, గాంగ్లగూడెం, అనంతారం, మల్లాయి గూడెం, వినాయకపురం, కేసప్పగూడెం, ఊట్లపల్లి, అశ్వారావుపేట మున్సిపాలిటీ, నారంవారిగూడెం, మద్ది కొండ లో సాయంత్రం 5.30 గంటలకు ముగుస్తుంది అని తెలిపారు.
సంబంధిత సర్పంచ్ లు, వార్డు సభ్యులు,మున్సిపాలిటీ పాలకవర్గం,అధికారులు, కాంగ్రెస్ నాయకులు, అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, అన్ని పంచాయతీ ల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, నాయకులు, సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు, ఇంచార్జ్ లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.



