నవతెలంగాణ – ధర్మసాగర్
ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగారపు అమృత రావు తండ్రి గంగారపు ఆదాం బుధవారం మరణించిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన పార్థివ దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఎనుమాముల మార్కెట్ డైరెక్టర్ బొడ్డు ప్రదీప్ కుమార్,మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి శరత్, మాజీ ఎంపీటీసీ రోండి రాజు యాదవ్, పిఎసిఎస్ డైరెక్టర్ బోర్డు లేని న్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్, స్థానిక ప్రజా ప్రతినిధులు కొలిపాక రమేష్, చెట్ల రమేష్, బొడ్డు ఎడ్వర్డ్, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అమృతరావు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కడియం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES