Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలాభివృద్దే ఎమ్మెల్యే కడియం లక్ష్యం: గుర్రపు ప్రసాద్

మండలాభివృద్దే ఎమ్మెల్యే కడియం లక్ష్యం: గుర్రపు ప్రసాద్

- Advertisement -

నవతెలంగాణ – ధర్మసాగర్
స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో ధర్మసాగర్ మండల అభివృద్దే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముందుకు సాగుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పాపిరెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా నియోజకవర్గానికి 333 కోట్ల 71 లక్షల రూపాయలను కేటాయింఫుకు ప్రత్యేక చొరవ తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నిధుల కేటాయింపులు మండలానికి అధిక మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.

ఈ నిధులతో ఉనికిచెర్ల క్రాస్ రోడ్డు నుండి రాపాకపల్లి గ్రామం వరకు, రాంపూర్ గ్రామం నుండి పెద్ద పెండ్యాల గ్రామం వరకు, తాటికాయల వయా పెద్ద పెండ్యాల రాంపూర్ గ్రామాల వరకు పంచాయతీ రాజ్ నిధుల నుండి కేటాయించడం జరిగిందన్నారు. అలానే నారాయణగిరి నుండి కొత్తకొండ, బండ తండ వరకు, మడికొండ నుండి వయా ఎల్కుర్తి ముప్పారం గ్రామంలో నుండి నారాయణగిరి వరకు బీటీ రోడ్లను వేయించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు మండలంలో 1388 కోట్ల 71 లక్షల రూపాయల అభివృద్ధి పనులు వెచ్చించడం జరిగిందని తెలిపారు. ఏదేమైనా మండల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న స్థానిక ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

నియోజకవర్గము అభివృద్ధికి ఆమేడ దూరంలో ఉన్న గత పాలకులు 15 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగిందని విమర్శించారు. అంతకుముందు కడియం శ్రీహరి ఆయంలో జరిగిన అభివృద్ధి తప్ప గత పాలకులు చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు.అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్రపటాలకు ఈ సందర్భంగా వారు పాలాభిషేకాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు బొడ్డు ప్రదీప్ కుమార్, ఎర్రబెల్లి శరత్, బిరుదరాజు రఘు, యాకూబ్ పాషా,రావుల వెంకటరెడ్డి, బొడ్డు లేనిన్, కొలిపాక మల్లేష్, రాజారపు నాగరాజు, కొలిపాక లక్ష్మి దుర్గయ్య, కొలిపాక రమేష్, రొండి రాజు యాదవ్, బొడ్డు ప్రేమ రాజ్, మాచర్ల రవి, యాసీన్ మియా, మంద ఆరోగ్యం,అనురాధ టాగూర్, మొట్టె యామిని కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -