Sunday, November 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – తలకొండపల్లి
ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన  ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. దేవాలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలంతా ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకు పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని  వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలోని సోదరుడు వెంకటరెడ్డి, డాక్టర్ సురభి వెంకటేశ్వరరావు, సురేందర్ రెడ్డి, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -