- Advertisement -
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజాన్ తోఫా కిట్లను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ పర్వదినం శాంతి, సోదరభావం, సేవాభావానికి ప్రతీక అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి తాసిల్దార్ జగన్మోహన్ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ పోత్తం శెట్టి మంజుల వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్థి, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



