నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
చిట్యాల టు భువనగిరి ప్రధాన రహాదారి నందనం టు నాగిరెడ్డి పల్లి వద్ద బారీ వర్షాలకు వరద ఉధృతి పెరిగి ప్రమాధకరంగా మారి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన నాగిరెడ్డిపల్లి వద్ద వరద ఉధృతిని పరిశీలించి, మాట్లాడారు. భారీ వర్షాలు పడినప్పుడు వాహనాలు కొట్టుకు పోయే పరిస్థితి ఉందని, ఆక్సిడెంట్లు జరుగుతున్నాయని అన్నారు. ఈ రోడ్డు స్టేట్ హైవే పరిధిలోకి రాదని, నేషనల్ హైవే పరిధిలోకు వస్తుందని అన్నారు. నేషనల్ హైవేస్ పిడితో మాట్లాడారు.
నేషనల్ హైవే నుండి ప్రపోసల్స్, సాంక్షన్ తీసుకురావలని. లేకుంటే ఆర్ అండ్ బీ కి అప్పజెప్పాలని తెలిపారు. నేషనల్ హైవే అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోడ్డు ఫోర్ లేన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నేషనల్ హైవే వారు టేకప్ చేయకుంటే ఆర్ అండ్ బీ కి అప్పజెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చుక్క స్వామి, మల్లికార్జున్ రెడ్డి, బాబురావు, పిట్టల రజిత, రావి సురేష్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు ప్రమోద్ కుమార్, బర్రె జహంగీర్, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎల్లంల జంగయ్య యాదవ్, ఏడు మేకల మహేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.