Sunday, August 3, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కుంభం

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కుంభం

- Advertisement -

నవతెలంగాణ  – భువనగిరి 
భువనగిరి పట్టణం జగదేపూర్ చౌరస్తా వద్ద మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం సంఘటన స్థలాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదాలు జరగకుండా పోలీసులు తగు చర్యలు చేపట్టాలని సూచించారు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు వాహనాల వేగాన్ని నిలుపుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ స్థలంలో ప్రమాదాలు జరగడానికి కారణం ఎలా నివారించవచ్చు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్  అవేస్ చేస్తూ, మున్సిపల్ మాజీ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -