Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జలసౌధలో మంత్రి ఉత్తమ్ కలిసిన ఎమ్మెల్యే కుంభం

జలసౌధలో మంత్రి ఉత్తమ్ కలిసిన ఎమ్మెల్యే కుంభం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : హైదరాబాద్ లోని జలసౌదాలో ఇరిగేషన్ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలిసి, చిన్న నీటి కాలువల మరమ్మతులకు రూ.30 కోట్లు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్, భువనగిరి మండలాలకు సంబందించిన బోల్లేపల్లి కాలువ, వలిగొండ మండలానికి సంబందించిన బీమలింగం కాలువ,  పోచంపల్లి మండలానికి సంబందించిన అలీనగర్ కాలువల మరమ్మత్తులకు 30కోట్ల నిధులు కేటాయించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. చిన్నేరు వాగుపై ఉన్న మాదారం, వడపర్తి, అనాజీపురం, బోల్లేపల్లి వద్ద చెక్ డ్యాముల నిర్మాణం కోసం 25 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. ముసీ వాగుకు సంబందించిన అన్ని ఫీడర్ కాలువల యందు గుర్రుపు డెక్క ఆకు తొలగించుటకు నిర్వాహణకు ప్రతీ సంవత్సరం 1కోటి 20లక్షల బడ్జెట్ కేటాయించాలని కోరారు..

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img