నవతెలంగాణ – చండూరు : గట్టుప్పల మండల కేంద్రం లో 1.43 కోట్ల నిధులతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులకు శనివారం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన గ్రంధాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్వరితగతిన నిర్మాణ పనులు ప్రారంభించి అందుబాటులోకి తీసుకరావాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చెర్మెన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి ఆర్డీవో శ్రీదేవి, ఎంపిడిఓ మాధవ్ రెడ్డి, తహశీల్దార్ రాములు, కార్యదర్శి షఫి కాంగ్రెస్ నాయకులు దండు యాదగిరి రెడ్డి, నామని జగన్నాధం, కంచుకట్ల సంపత్, రావుల రమేష్, దోర్నాల అంజయ్య, సామల యాదయ్య, సత్తయ్య, మల్లేశం, యాదయ్య, వైద్య అధికారులు ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే..గట్టుప్పల్ మండలంలోని తేరట్ పల్లి గ్రామంలో శనివారం శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని హోమం వద్ద, అమ్మవారికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోడిసిసిబి చెర్మెన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ వీరమల్ల శ్రీశైలం గౌడ్, కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES