Wednesday, December 17, 2025
E-PAPER
Homeజిల్లాలుసర్పంచ్ చిన ధనమ్మను అభినందించిన ఎంఎల్ఏ లక్ష్మారెడ్డి

సర్పంచ్ చిన ధనమ్మను అభినందించిన ఎంఎల్ఏ లక్ష్మారెడ్డి

- Advertisement -

నవతెలంగాణ మిర్యాలగూడ

మిర్యాలగూడ మండలం జంకుతండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలుపొందిన మెరావత్ చిన ధనమ్మను ఎంఎల్ఏ బత్తుల లక్ష్మారెడ్డి బుధవారం ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంకు తండా గ్రామ పంచాయతీ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొత్త సర్పంచ్ లు గ్రామాలలో పేర్కోపోయిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మెరవాత్ దాస్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -