నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి మున్సిపాలిటీ సేవలు కోసం దాదాపు కోటి రూపాయల వ్యయంతో కొత్తగా కొనుగోలు చేసిన ట్రాక్టర్లు ఆటోలు డోజర్లను శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వనపర్తి మున్సిపాలిటీ నుంచి క్యాంపు కార్యాలయం వరకు కొత్తగా కొనుగోలు చేసిన ట్రాక్టర్లు నడుపుతూ తీసుకొచ్చారు. ఈ వాహనాల ప్రారంభ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే మాట్లాడుతూ దినదిన అభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణా శుభ్రత అవసరం రీత్యా కొనుగోలు చేసిన ఈ వాహనాల సేవలను పట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగపడేలా సమర్థవంతరంగా వినియోగించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ పుట్టపాకల మహేష్, మాజీ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, మాజీ కౌన్సిలర్లు, నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి మున్సిపాలిటీలో నూతన వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES