నవతెలంగాణ – నెక్కొండ
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామoలో రహదారులు, మౌలిక వసతుల కల్పనే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నెక్కొండ మండలం నందమూరి నగర్, రాజీవ్ నగర్ ఎస్సీ కాలనీల్లో సిసి రోడ్డు, సైడ్ కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఉపసర్పంచ్ సింగం శ్రావణి -ప్రశాంత్, కుసుమ చెన్న కేశవులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల శ్రీనివాస్, లావుడ్యా తిరుమల్, ఇదునూరి సాయికృష్ణ, చల్లా శ్రీపాల్ రెడ్డి, కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, కొనిజెటి బిక్షపతి, చల్లా రగోత్తం రెడ్డి, శ్రీకాంత్, శిరీష, మధుకర్ రెడ్డి,అమీర్, మౌనిక, శ్రావణి, విజయ,రవి పాల్గొన్నారు.



