Wednesday, August 12, 2026
E-PAPER
Homeమానవిదోమల నివారణకు…

దోమల నివారణకు…

- Advertisement -

దోమల సమస్య ప్రతి ఒక్కరూ ఎదుర్కొనేదే. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరమైన జబ్బులను వ్యాప్తి చేస్తాయి. అందుకే వీటిని నివారించడం చాలా ముఖ్యం. ఎటువంటి రసాయనాలను ఉపయోగించకుండా సహజసిద్ధమైన పద్ధతులతో దొమలను నివారించవచ్చు.

లవంగాలు
లవంగాలు – నిమ్మరసాన్ని మిక్స్ చేసి దోమలు ఉండే ప్రదేశాల్లో ఉంచండి. దీని వాసన దోమలకు పడదు. లవంగపు గింజలను నీటిలో ఉడికించి ఆ నీటిని ఇంట్లో అటూ ఇటూ చల్లుకోవచ్చు. లవంగపు నూనెను దీపం వెలిగించేటప్పుడు కొన్ని చుక్కలు వేయవచ్చు. ఇలా చేయడం వల్ల దోమల బెడద తగ్గుతుంది.

నిమ్మరసం, నిమ్మతొక్కలతో…
దోమలను నివారించడానికినిమ్మరసాన్ని నీటిలో కలిపి ఇళ్ల మూలల్లో చల్లి చూడండి. నిమ్మకాయ తొక్కలను దొమలు ఎక్కువగా చేరే ప్రదేశాల్లో ఉంచితే అవి దూరంగా ఉంటాయి.

వెల్లుల్లి నీరు
వెల్లుల్లి రెబ్బలను కోసి గదిలో ఉంచడం ద్వారా దోమలను దూరం చేయవచ్చు. వెల్లుల్లిని నీటిలో మరిగించి ఆ నీటిని గదుల్లో స్ప్రే చేయండి. వెల్లుల్లి వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. కర్పూరాన్ని చిన్న పాత్రలో వెలిగించి గదిలో ఉంచితే అవి పారిపోతాయి.

లెమన్ గ్రాస్
లెమన్ గ్రాస్ నూనెను దీపం వెలిగించేటప్పుడు కొన్ని చుక్కలు వేయవచ్చు. లెమన్ గ్రాస్ ఆకులను నీటిలో ఉడికించి ఆ నీటిని స్ప్రే చేయవచ్చు.

కాఫీ పొడి
వంటింట్లో ఉన్న కాఫీ పొడి దోమలను మటుమాయం చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నీటి నిల్వ ప్రాంతాల్లో కాఫీ పొడిని చల్లితే దోమ గుడ్లు పగిలిపోతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -