ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నా.. పండుగ లేదా విహారయాత్రైనా అమ్మాయిలకు ఒకటే భయం! ఎక్కడ నెలసరి వస్తుందో.. కార్యక్రమానికి అడ్డంకిగా మారుతుందో అని! దీన్ని ఆపడానికి.. ఏ మాత్రం ఆలోచించకుండా చకచకా వెళ్లి ట్యాబ్లెట్లు తెచ్చుకుంటారు. కానీ, దీనివల్ల ఎన్ని సమస్యలో తెలుసా? పీరియడ్స్.. ఇది గర్భధారణకు సంబంధించిన ప్రక్రియ మాత్రమే కాదు. మన మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రధాన సూచిక. కానీ చాలామంది ఏవేవో కారణాలతో దీన్ని మందులతో వాయిదా వేస్తుంటారు. ఇది ఆ ఒక్క సమయంతో పోదట. పీరియడ్స్ క్రమాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అధిక రక్తస్రావం, విపరీతమైన కడుపు, నడుము నొప్పి.. ఇలా ఎన్నింటికో కారణం కావొచ్చని అంటున్నారు. వీటి అతి వినియో గంతో శరీరం సొంతంగా హార్మోన్లు చేసుకోవ డానికి అడ్డుకట్ట పడొచ్చని పేర్కొంటున్నారు. దీంతో ఆందోళన, అలసట, ఒత్తిడి వంటి లేని పోని మానసిక సమస్యలూ పెరుగు తాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు హార్మోన్ల అసమ తుల్యతతో అండాశయంలో చిన్నచిన్న నీటి బుడగలు ఏర్పడి పీఎంఓసీ వచ్చే ప్రమాదం ఉందని తెలియజేస్తున్నారు. దీనివల్ల ముఖంపై అవాంఛిత రోమాలు, జుట్టు రాలిపోవటం, వేగంగా బరువు పెరగటం వంటి సమస్యలూ ఎదురవుతాయని వివరిస్తు న్నారు.
అండం విడుదలలో సమస్యలు: ఇది నేరుగా సంతాన లేమికి కారణం కాకపోయినా అండం విడుదలయ్యే ప్రక్రియ సక్రమంగా జరగదని చెబుతున్నారు. దీంతో ఆలస్యమయ్యే అవకాశముందని అంటున్నారు. వీటిని అతిగా వాడేవారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. 35 దాటి.. ఒబెసిటీ, బీపీ, డయాబెటిస్, మైగ్రేన్ వంటి సమస్యలున్న వారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువని పేర్కొంటున్నారు. అంతేకాదు కాలేయంపైనా అదనపు భారం పడుతుందట. ఎముకలూ బలహీన పడతాయని తెలియజేస్తున్నారు. పీరియడ్స్ చేసే మేలు: పీరియడ్స్‌ని చాలా సార్లు అడ్డుగా భావిస్తారు. కానీ మనకు ఇది చేసే మేలు చాలానే ఉంది. రుతుక్రమం సరిగ్గా ఉన్నవాళ్లలో రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎల్‌డీఎల్ అదుపులో ఉంటుంది. ఈస్ట్రోజన్ స్థాయులు బాగుంటేనే శరీరానికి కాల్షియం సరిగ్గా అందుతుంది. పీరియడ్స్‌లో గర్భాశయం లోపలి పొర రక్తం ద్వారా బయటికి వస్తుంది. దీనివల్ల కణాలు పేరుకుపోకుండా, ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షణ కలుగుతుంది. బాడీలో ఐరన్ స్థాయులు మోతాదుకు మించకుండా రక్షిస్తుంది. ప్రతినెలా అండం సరైన సమయానికి విడుదలైతే, గర్భధారణ కూడా ఆలస్యం కాదు. వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. అందుకే అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడో ఒకసారే వాడాలి. అది కూడా పీరియడ్స్‌కి 3-4 రోజుల ముందే ప్రారంభించాలి.
సొంతంగా వేసుకుంటున్నారా?: చాలామంది నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి తీసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకర మని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో గైనకాలజిస్టును సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి, బరువు, వయసు, గతంలో అనారోగ్య సమస్యలను బట్టి మందులు సూచిస్తారని తెలియజేస్తున్నారు. వాటిని చెప్పిన మోతాదులో, నిర్దేశించిన రోజులే వాడాలని వివరిస్తున్నారు. ఇది మరీ ప్రమాదం: కొందరైతే పూజలు, వ్రతాలంటూ వారాల కొద్దీ వినియోగిస్తారట. అలా వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. మందులు ఆపేసిన రెండు మూడు రోజుల్లో పీరియడ్స్ వస్తాయంటున్నారు. 10 రోజులు దాటినా రాకపోతే వెంటనే డాక్టర్లును సంప్రదించాలని తెలియజేస్తున్నారు. ఇంకొందరైతే గర్భం దాల్చిన విషయం గమనించుకోక ఉపయోగి స్తుంటారట. దీనివల్ల పిండానికి నష్టం కలుగు తుందని హెచ్చరిస్తున్నారు. అదే డాక్టర్లును సంప్రదిస్తే ప్రెగ్నెన్సీ పరీక్ష చేసి నెగెటివ్ వస్తేనే ఈ మాత్రలు రాస్తారని చెబుతున్నారు. చట్ట ప్రకారం ఇలాంటి మందులు ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇవ్వాలని నిపుణులు పేర్కొంటున్నారు.
వాయిదా వేస్తున్నారా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


