Tuesday, March 24, 2026
E-PAPER
Homeనిజామాబాద్నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో గళ‌మెత్తిన ఎమ్మెల్యే పైడి

నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో గళ‌మెత్తిన ఎమ్మెల్యే పైడి

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్: వేలకోట్ల బడ్జెట్లు, అనర్హులకు పథకాలు ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో గళ‌మెత్తారు. నియోజకవర్గంలోని గతంలో పనులు చేసిన చిన్నచిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నియోజకవర్గంలోని షాపూర్ గ్రామ సర్పంచ్ ఉన్న ఇల్లు అమ్ముకొని భార్య మెడలోని మంగళసూత్రం సైతం అమ్ముకున్నాడని అన్నారు. నియోజకవర్గంలోని నూత్ పల్లిలో గల హాస్టల్ డోర్లకు 20 రూపాయల టవర్ బోలోడ్స్ సైతం లేవని, కుద్వాన్పూర్ హాస్టల్ యందు 300 మంది విద్యార్థులు ఉండగా రెండు బాత్రూములే ఉన్నాయ‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవని, కనీసం కరెంటు కూడా లేదని ,పేదవారికి విలువైనది చదువు ఒక్కటేన‌ని , తాను ఎమ్మెల్యే అయినా అప్పటినుండి నందిపేట లో డిగ్రీ కళాశాల, మండలానికి ఒక జూనియర్ కళాశాల కావాలని పదిసార్లు ముఖ్యమంత్రికి సైతం వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. పేద విద్యార్థులు చదువుకునేందుకు ఏ నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలకు వెళ్లలేరని,విద్య, వైద్యం అవసరం అని, ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరినారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -