నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలో జరుగుతున్న పనులలో నాణ్యత లోపించిన కఠిన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. పట్టణంలో సోమవారం వివిధ వార్డులో 65కోట్లతో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి లో ప్రజలు భాగస్వామ్యం కావాలని డ్రైనేజీ నిర్మాణాలు చేసి వాటి పక్కన మొరం ఎందుకు పోయడం లేదు అని అధికారులను అడిగారు ఒడ్డర కాలని లో డ్రైనేజీ నిర్మాణం నసీరంకంగా ఉంది అని కాలని వాసులు తెలపడంతో మరి ఒక సారి ఇలాంటి పనులు చేస్తే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అధికారులు ఉదయం సమయంలో, సాయత్రం సమయంలో పనుల పురోగతి పరిశీలించాలని అన్ని పనులను మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపల పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో పనులు కోసం నిధులు గత ప్రభుత్వం హయాంలో మజూరు చేసి శిలాఫలకం ద్వారా పనులు ప్రారంభం చేసి ఎందుకు ఆపేశారు. తెలుపాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్ ,మున్సిపల్ కమిషనర్ శ్రావణి, పి ఆర్ సబ్ డివిజన్ డి. ఈ. ఎం కిషన్ నాయక్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పాలెపు రాజు, పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, కంచెట్టి గంగాధర్, కలిగోట్ గంగాధర్, సుంకరి రంగన్న, ఉదయ్ గౌడ్, భారత్, కుమార్, తిరుపతి నాయక్, బలిపల్లి నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాసిరకం పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



