నవతెలంగాణ – జుక్కల్
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ స్థాయిలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో అందరూ ఐక్యమత్యంగా పార్టీ గెలుపు కోసం కష్టపడి మంచి ఫలితాలు సాధించడంలో కృషి చేసిన ప్రతీ కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో పార్టీ జెండాను మోసి ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన ప్రతీ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.
పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడిన కార్యకర్తల సేవలను ఎప్పటికీ మరిచిపోమని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని బలపరిచిన సీనియర్ నాయకులు, సర్పంచులు, మండల అధ్యక్షులు , కార్యకర్తలకు మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇదే ఐక్యమత్యాన్ని కొనసాగిస్తూ పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సర్పంచ్ గజ్జల జీవన్ , డాక్టర్ విజయ్ కుమార్ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమక్షంలో జుక్కల్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



