- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక శివోహం దుర్గా మండలి సభ్యులు ఏర్పాటు చేసి నవదుర్గ అమ్మవారిని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి, నీరజారెడ్డి దంపతులు, ఆయన సోదరుడు వేముల శ్రీనివాస్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను శివోహం దుర్గా మండలి సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
- Advertisement -