నవతెలంగాణ-కమ్మర్ పల్లి
హైదరాబాదులోని సచివాలయం వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో జిల్లాకు చెందిన రాష్ట్ర మాజీ, మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత, యూరియా దొరక్క పోవడంతో రైతులు పడుతున్న తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సచివాలయం గేటు ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసన చేపట్టిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన ఎమ్మెల్యేలు జిల్లాకు చెందిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని ఆరోపించారు.
ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES