- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్బంగా రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలతో ఘనమైన నివాళి అర్పించారు.బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది కొండ లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో లక్ష్మణ్ బాపూజీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
- Advertisement -