నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలో పలువురు ఆత్మీయులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం పరామర్శించారు. మండల కేంద్రంలో నివాసముంటున్న నాగపూర్ మాజీ సర్పంచ్ పాలెపు సాయమ్మ మనవడు బిఆర్ఎస్ నాయకులు పాలెపు రవి కిరణ్ ఆరోగ్యం బాగాలేనందున ఆయన్ని పరామర్శించారు.హాసకోత్తురు గ్రామంలో మెట్టుపల్లి రాజన్న గుండెపోటుతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు.
మంగలి శంకర్ భార్య అనారోగ్యంతో మరణించడంతో వారిని కుటుంబ సభ్యులను పరామర్శించారు.మంగలి నర్సయ్య మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.బషీరాబాద్ గ్రామంలో బషీరాబాద్ గ్రామ ఎంపిటిసి మామ, బిఆర్ఎస్ నాయకులు అప్పయ్య కాలు ఇన్ఫెక్షన్ తో బాధ పడుతుండటంతో వారిని పరామర్శించారు.భోజపల్లి దేవిదాస్ వాళ్ళ నాన్న కాలం చేయడంతో వారిని కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, రాజా గౌడ్, నాయకులు ఏనుగు గంగారెడ్డి, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
పలువురు ఆత్మీయులను పరామర్శించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES