Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గల్ఫ్ మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శ

గల్ఫ్ మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శ

- Advertisement -

– రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేల్పూర్ గ్రామానికి చెందిన గల్ఫ్ మృతుడు జెల్ల అనిల్ కుటుంబ సభ్యులను రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. గ్రామానికి చెందిన జెల్ల అనిల్ ఉపాధి నిమిత్తం టర్కీ దేశానికి వెళ్ళాడు. ఇటీవల దురదృష్టవశాత్తు అక్కడ మృతి చెందాడు. అనిల్ మృతదేహం సోమవారం స్వగ్రామం చేరుకోవడంతో కుటుంబ సభ్యులు అంతక్రియలు పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ లో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేశారు. ఈ సందర్బంగా మృతుడి కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అక్కడి నుండే సంబంధిత అధికారులకు మాట్లాడి గల్ఫ్ లో మృతి చెందిన వారికీ ప్రభుత్వం తరపున అందాల్సిన పరిహారం వెంటనే వచ్చేలా చూడాలని ఆదేశించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -