- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజలందరికీ, జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వినాయక చవితి పండగ ప్రజలందరి విఘ్నాలన్నీ తొలగిపోవాలని, ప్రజలందరూ సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ విగ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులు,కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.
- Advertisement -