నవతెలంగాణ – కుభీర్
మండలంలోని పార్డి( బి )గ్రామమలో సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మించేందుకు 28లక్షల కు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను శనివారం బైంసా పట్టణంలోని ఎస్ ఎస్ జిన్నింగ్ మిల్లులో ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఫార్డి బి గ్రామానికి చెందిన స్థానిక సర్పంచ్ మడి ప్రవీణ్ కు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముధోల్ నియోజకవర్గం లో ఉన్న అన్ని గ్రామాల అభివృద్ది కి తన వంతుగా క్కూస్ చేస్తాను సూచించారు. గ్రామాల్లో సిసి రోడ్లు మురికి కాలువలు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే సూచించారు. గ్రామానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు స్థానిక సర్పంచ్ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
అభివృద్ధి పనుల ప్రొసీడింగ్ కాపీలను అందజేసిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



