నవతెలంగాణ – తుంగతుర్తి
మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన పోన్నం కిషోర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దాయం ఝాన్సీ రాజిరెడ్డి స్థానిక శాసనసభ్యులు మందుల సామేల్ దృష్టికి తీసుకువెళ్లగా రూ.1,20,000 ఎల్ ఓ సి ను బుధవారం ఎమ్మెల్యే మందుల సామేల్ హైదరాబాదులోని తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, తుంగతుర్తి ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటానని, ఎవరు ఏ అవసరం ఉన్నా నిర్భయంగా తనకు తెలియజేయాలని తెలిపారు. త్వరితగతిన ఎల్.ఓ.సి మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే సామేల్ కు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన ఝాన్సీ రాజిరెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
బాదితులకు ఎల్ఓసీ అందించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES