నవతెలంగాణ – ఆత్మకూరు
సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా అగ్రంపహాడ్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, హనుమకొండ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి రెడ్‌క్రాస్ చేస్తున్న సేవలను అభినందించారు. ఆపదకాలంలో రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడటమే కాకుండా, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. రెడ్‌క్రాస్ సంస్థకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
రక్తదానం తోపాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెడ్‌క్రాస్ అభివృద్ధికి అన్ని విధాలా సహకారాలు అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలోనే ఉత్తమ రెడ్‌క్రాస్‌గా హనుమకొండను నిలబెట్టిన పాలకవర్గాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. హనుమకొండ రెడ్‌క్రాస్ చైర్మన్ పి.విజయచందర్‌రెడ్డి మాట్లాడుతూ, పాలకవర్గ సహకారంతో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా అగ్రంపహాడ్‌లో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఐదు రోజుల పాటు భక్తులు, ప్రజలకు వైద్య పరీక్షలు చేసి, ఉచిత మందులు పంపిణీ చేస్తున్నామని అన్నారు.
జాతరలో హెల్మెట్లు, మ జూట్ బ్యాగ్‌లు పంపిణీ..
అనంతరం హనుమకొండ రెడ్‌క్రాస్ సౌజన్యంతో ఎస్‌జేపీ ఫౌండేషన్ సహకారంతో జాతర వాలంటీర్లకు హెల్మెట్లు, వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగంగా భక్తులకు జూట్ బ్యాగ్‌లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది.ఈ కార్యక్రమంలో హనుమకొండ రెడ్‌క్రాస్ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఇ.వి.శ్రీనివాస్‌రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణుగోపాల్, బిళ్ల రమణారెడ్డి, ఆర్‌డీఓ కె.నారాయణ, దేవస్థాన ఇఓ నాగేశ్వర్‌రావు, అగ్రంపహాడ్ జాతర చైర్మన్ వంచ రంగారెడ్డి, ఏఎంసీ సుధాకర్‌రెడ్డి, ఆత్మకూర్ సీఐ సంతోష్, అగ్రంపహాడ్ సర్పంచ్ గంగుల మహేందర్, అక్కంపేట సర్పంచ్ ముద్దం సాంబయ్య, రెడ్‌క్రాస్ వైద్యులు డాక్టర్ జె.కిషన్‌రావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



