Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాయకులను పరామర్శించిన ఎమ్మెల్యే రేవూరి

నాయకులను పరామర్శించిన ఎమ్మెల్యే రేవూరి

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు 
సోమవారం హనుమకొండలోని ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రజా ప్రతినిధులను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరామర్శించారు. రోహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆత్మకూరు పిఎసిఎస్ చైర్మన్ జనగాం ప్రభాకర్, పెద్దాపూర్ గ్రామానికి చెందిన బొల్లోజు రవీందర్‌, ను శ్రీనివాస పినాకిల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అగ్రంపహడ్ జాతర చైర్మన్ శీలం రమేష్‌ లను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరామర్శించారు. వైద్యులతో చర్చించిన ఎమ్మెల్యే, సంబంధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన త్వరలోనే బాధితులు ఆరోగ్యంగా కోలుకోవాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కమలాపురం రమేష్, బోరిగం స్వామి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -