ఎమ్మెల్యే పొగ్రామ్స్ బహిస్కరణకు నిర్ణయం
ఎమ్మెల్యే వ్యాఖ్యలు అప్రజాస్వామికం
వెంటనే క్షమాపణ చెప్పాలి
నవతెలంగాణ – పరకాల
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్థానిక జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. పరకాల బస్టాండ్ వద్ద ఆక్రమణల తొలగింపును పరిశీలించేందుకు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అధికారులతో కలిసి గురువారం బస్టాండుకు వచ్చిన క్రమంలో స్థానిక జర్నలిస్టులు ట్రాఫిక్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయగా దురుసు మాటలతో చిందులు వేశారు.
జర్నలిస్టులు ఐతే ఏంటి..?
ఎవరికి వకల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు అని దురుసుగా వ్యవహరించారు. ప్రజలకోసం వకల్లా తీసుకుంటున్నామని చెప్పబోయె ప్రయత్నం చేయగా మళ్ళీ ఆగ్రహింతో ఊగిపోయారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్టులు కవరేజి నుంచి బయిటకు వచ్చారు.
ఎమ్మెల్యే వ్యాఖ్యలు అప్రజాస్వామికం.. వెంటనే క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తూ అమరదామంలో అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు చొళ్ళేటి సునేందర్, నేరళ్ళ పరుశురాం, బలేరావు బాబ్జీ, రావుల రాజు, బుర్ర తిరుపతి, దాసరి రమేష్, సుమంత్, మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు అప్రజాస్వామికం అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై ఎమ్మెల్యే నోరు పారేసుకోవడం గర్హనీయం అన్నారు. ఎవరి వకాల్తా పుచ్చుకున్నారని జర్నలిస్టులపై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే ప్రస్తుతం ఎవరి వకాల్తా పుచ్చుకుని బస్టాండ్ ఆక్రమణల ఇనుప కంచ తొలగించారని జర్నలిస్టులు ప్రశ్నించారు.స్వార్ద రాజకీయాల కోసం పరకాల ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతూ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి జర్నలిస్టులపై చిందులు తొక్కుతూ ప్రజాస్వామిక విలువలను తుంగలో తొక్కారని తీవ్రంగా విమర్శించారు.
బస్టాండ్ సెంటర్‌లో భారీ ధర్నా – నిలిచిన రాకపోకలు
సమావేశానంతరం జర్నలిస్టులందరూ కలిసి పరకాల బస్టాండ్ కూడలిలో భారీ ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సుమారు అరగంట పాటు సాగిన ఈ ధర్నా కారణంగా ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని గమనించిన సీఐ క్రాంతి కుమార్ జర్నలిస్టులకు నచ్చజెప్పి ధర్నా కార్యక్రమాన్ని విరమింప చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జర్నలిస్టులు కోగిల చంద్రమౌళి, శ్రీరామోజు వేణు, గూడెల్లి నాగేంద్ర, గూడెల్లి కార్తీక్, ఐలి విజయ్, బోజ శ్రీనివాస్ రెడ్డి, చిర్ర సతీష్, సత్యం, శ్రీనివాస్, అష్రఫ్, రాజు, శివ, పాషా, అబ్దుల్లా, రమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.



