- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు తనకు న్యాయ వ్యవస్థలపై మరోసారి సంపూర్ణమైన నమ్మకం కలిగిందని చెప్పారు. గత 12 ఏండ్లపాటు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన చెందారు. నేను ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్లెక్కాల్సి వచ్చిందని తెలిపారు. కేసుల నెపంతో తనను రాజకీయంగా అణచివేయాలనుకున్నారు. అవినీతి చేశానని, జైలుకు పోతానని నన్ను తీవ్రంగా హేళన చేశారని అన్నారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -