Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే షబ్బీర్ ఆలీకి క్షమాపణ చెప్పాలి

ఎమ్మెల్యే షబ్బీర్ ఆలీకి క్షమాపణ చెప్పాలి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీకి క్షమాపణ చెప్పాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీం రెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తు ఎమ్మెల్యే వైఫల్యాలను ఎండగట్టారు. ఎన్నికల హామీలను అమలు చేయలేదని, రూ.150 కోట్ల అభివృద్ధి నిధులపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

కామారెడ్డి మున్సిపాలిటీలో పార్టీ విజయం సాధించలేకపోయారని విమర్శించారు. దేశం, ధర్మం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. షాది ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ తప్ప అభివృద్ధి కనిపించడం లేదన్నారు. షబ్బీర్ అలీకి క్షమాపణ చెప్పకపోతే మండలంలో నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీరాం వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, నాయకులు లింబాద్రి, మహిపాల్ రెడ్డి,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -