– నియోజకవర్గ స్థాయి ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల సంఘం..
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో RMP (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్) & PMP (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్) సభ్యులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్.ఎం.పి , పి.ఎం.పి (RMP, PMP) లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. గ్రామాలలో ఆర్ఎంపి, పీఎంపి ల పాత్ర ప్రాముఖ్యంగా ఉంటుందని అన్నారు. ఆర్.ఎం.పి, పిఎంపి వైద్యులు నిబంధనల ప్రకారం విధులు చేసుకోవాలని, పరిధికి మించి వైద్యం చేస్తే సమస్యలు తలెత్తుతాయని, ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, సమస్యలు వస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఆర్ఎంపి పి.ఎం.పి వైద్యుల సంఘం ప్రతినిధులు, ఆర్ఎంపి పీ ఎంపీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గారూ.. మా సమస్యలు పరిష్కరించండి..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES