నవతెలంగాణ – వనపర్తి
సికింద్రాబాద్ డివిజన్లోని డోర్నకల్ , హైదరాబాద్ డివిజన్ లోని శ్రీరామ్ నగర్ మధ్య కొత్త లైన్ కు సంబంధించిన సర్వే పూర్తయినట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని ద్వారా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ సింగరేణి కాలరీస్ నుండి ధర్మల్ విద్యుత్ ప్లాంట్లకు ముడి పదార్థాల సరఫరాకు ఈ లైను ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డోర్నకల్ స్టేషన్ -సికింద్రాబాద్ విజయవాడ లైన్, మర్రిపేట్ దక్షిణ మధ్య రైల్వే లో సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి, సికింద్రాబాద్, డోర్నకల్ సమీపంలోని శ్రీరామ్ నగర్ స్టేషన్ వరకు రైల్వే సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ రైలు మార్గం సుమారు పొడవు 304 కిలోమీటర్లు ఉండబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ నిర్మాణం పూర్తి సమయం సుమారు ఐదు సంవత్సరాలు పట్టవచ్చునని ఆయన తెలిపారు. ఈ లైన్ ప్రాంతీయ ప్రాంతాలను కలుపుతూ తెలంగాణలోని నైరుతి భాగాన్ని ఈశాన్య ప్రాంతాలను అనుసంధించడంతో తెలంగాణ ప్రాంతంలో సామాజిక ఆర్థిక అభివృద్ధిని కూడా మెరుగుపడుతుందన్నారు. ఈ లైన్ సింగరేణి కాలరీస్ ల నుండి కర్ణాటకలోని విద్యుత్ ప్లాంట్లకు, రాయచూర్ టిపిఎస్ ఎమ్మారైస్ టిపిఎస్ లకు మధ్య దూరాన్ని తగ్గిస్తుందన్నారు. వనపర్తి పట్టణ గుండా వెళ్లే ఈ రైలు మార్గం ద్వారా ఈ ప్రాంతం సైతం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
డోర్నకల్- గద్వాల కొత్త రైల్వే లైన్ కు సర్వే పూర్తిఎంపీ డా.మల్లురవికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES