నవతెలంగాణ – జుక్కల్
ప్రతి ఏటా శ్రావణ మాసం పురస్కరించుకొని మండలంలోని జుక్కల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు ఉపవాసం ఉంటారు. వారు శ్రావణమాసలోని ప్రతి మూడవ మంగళవారం బస్వాపూర్ గ్రామం నుండి మీర్జాపూర్ హనుమాన్ ఆలయానికి భక్తులు పాదయాత్రగా వెళ్తారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవరణలో పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు అల్పాహారంతో పాటు వాటర్ బాటిల్, చాయ్, బిస్కెట్స్, పండ్లు ఫలహారాలను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యేతో పాటు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ పటేల్, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఉపవాస ఆచరించే భక్తులకు అందజేసారు.
ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ ..నియోజకవర్గంలోని ప్రజలు చాలా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరిస్తు ఉంటారని తెలిపారు. వారి పట్ల తనకు గౌరవంగా ఉంది అని అన్నారు. దైవ భక్తి చేసేవారు ఎల్లప్పుడూ ప్రాంత సుభిక్షత కోరుకుంటారని, సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని రైతులు, కర్షకులు, కార్మికులు అందరూ సఖ సంతోషంతో ఉండాలని నేను కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల యుత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సిద్దాపూర్ మనోహర్ పటేల్ , బొంపెల్లి విజయ్ కూమార్ , బసవరాజ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు తేనీటి విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES